File:థీమ్సా నృత్యం (DIMSA DANCE).jpg
![File:థీమ్సా నృత్యం (DIMSA DANCE).jpg](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/11/%E0%B0%A5%E0%B1%80%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE_%E0%B0%A8%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82_%28DIMSA_DANCE%29.jpg/800px-%E0%B0%A5%E0%B1%80%E0%B0%AE%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BE_%E0%B0%A8%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82_%28DIMSA_DANCE%29.jpg?20171109152437)
Original file (4,160 × 3,120 pixels, file size: 2.08 MB, MIME type: image/jpeg)
Captions
Captions
Summary
[edit]Descriptionథీమ్సా నృత్యం (DIMSA DANCE).jpg |
థీమ్సా నృత్యం: సాధారణ గిరిజన నృత్యాలు దైలారాధనతో పాటుగా ఉల్లాస భరిత వాతావరణానికి పరిమితమవడం కనిపిస్తుంది.కానీ కోయ నృత్యాలు ఈ రెండింటితో పాటూ కోయల జీవితంలో భాగం కావడం విశేషం. కోయల పుట్టుక నుండి మరణం వరకూ జరిగే అన్ని కార్యక్రమాలలో మద్య మాంసాలతో పాటుగా నృత్యం తప్పనిసరి. కోయ నృత్యంలో స్త్రీలకు,పురుషులకూ మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది.పురుషులు ప్రత్యేక వస్త్రధారణ తో డోళ్ళను లయబద్దంగా వాయిస్తూ అడుగులు వేసుకంటూ నృత్యం చేస్తే, స్త్రీలు తమ చీరలను నిత్య జీవితంలో మాదిరిగానే ధరించి కొప్పులో పూలు పెట్టుకుని నృత్యం చేయడం జరుగుతుంది.ఒక్కోసారి ఇది గేయ సహితంగా మరియు వాద్య రహితంగా ప్రదర్శించబడుతుంది.కోయల స్త్రీ నృత్యం ఇతర గిరిజన తెగల నృత్యాలతో సారూప్యతను కలిగి ఉంటుంది. ఈ నృత్యంలో వాద్య సహకారాలూ లేకపోయినా కూడా లయబద్దంగా సాగే వారి అడుగులే వారి గేయాలకు లయను అందిస్తూ వాద్యం లేని కొరతను తీరుస్తాయని చెప్పవచ్చును.నృత్యం చేసేటపుడు ఒకరి అరచేతిని మరొకరు లేదా ఒకరి నడుమును మరొకరూ పట్టుకుని నృత్యం చేస్తారు అడుగులు వేసే పద్దతిలో రెండు కాళ్ళతో అంటే కుడి కాలితో ఎడమవైపు తడుతూ కుడివైపుకు జరుగుతూ వలయారంగా నృత్యం చేస్తారు. ఒక్కోసారి వీరు ముందుకు సాగే పద్ధతి పాము నడకవలే కనబడుతుంది కానీ వీరు చాలి వరకూ వలయాకారానికే ప్రాముఖ్యతను ఇస్తారు.మెుదటి స్త్రీ అడుగుల క్రమాన్నే దాదాపుగా అందరూ పాటించడం జరుగుతుంది. ఈ అడుగుర్లో కూడా ఒక్కొక్క అడుగునూ గాలిలో లేపుతూ,రెండొ అడుగును వెనకకు తడుతూ నృత్యం చేయడమనే రకరకాల విన్యాసాలు కనిపిస్తాయి. నడి వయస్సు వారు యువతులు నృత్యం చేస్తే అడుగుల విన్యాసాలు ఆకర్షణీయంగా కనబడుతాయి. ఈ సందర్భానికి సంబంధించిన గేయాన్ని బృందంలో ఒకరు పాడితే దానిని మిగిలిన వారు అనుకరిస్తారు. ఇతర గిరిజనులలో నృత్యం అనేది ఇటు ఆరాధన అటు ఆనందం మేరకు ప్రదర్శించబడితే కోయలలో మాత్రం ఈ రెండింటితో పాటూ వివాహ వేడుకలలొ ఆచారం కావడం అదనమే కాక నృత్య పరంగా కోయవారికి ఉన్న ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. |
Date | 9 November 2017 (according to Exif data) |
Source | Own work |
Author | Adbh266 |
Licensing
[edit]![w:en:Creative Commons](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/79/CC_some_rights_reserved.svg/90px-CC_some_rights_reserved.svg.png)
![attribution](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/11/Cc-by_new_white.svg/24px-Cc-by_new_white.svg.png)
![share alike](https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/df/Cc-sa_white.svg/24px-Cc-sa_white.svg.png)
- You are free:
- to share – to copy, distribute and transmit the work
- to remix – to adapt the work
- Under the following conditions:
- attribution – You must give appropriate credit, provide a link to the license, and indicate if changes were made. You may do so in any reasonable manner, but not in any way that suggests the licensor endorses you or your use.
- share alike – If you remix, transform, or build upon the material, you must distribute your contributions under the same or compatible license as the original.
![]() |
This file was uploaded via Mobile Android App (Commons mobile app) 2.4.2. |
File history
Click on a date/time to view the file as it appeared at that time.
Date/Time | Thumbnail | Dimensions | User | Comment | |
---|---|---|---|---|---|
current | 15:24, 9 November 2017 | ![]() | 4,160 × 3,120 (2.08 MB) | Adbh266 (talk | contribs) | Uploaded using Android Commons app |
You cannot overwrite this file.
File usage on Commons
The following page uses this file: